వివాహం అయిన చాలా మందికి గర్భం గురించి ఆందోళన ఉంటుంది.. ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు ఎప్పుడు దీనికి అనువైన సమయం అనేది కొందరికి అవగాహన ఉండదు, అయితే దీనిపై వైద్యులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
ఓవరీస్ నుండి ఎగ్ రిలీజ్ అవ్వడాన్నే ఓవులేషన్ అంటారు. ఇది కూడా నెల నెలా జరుగుతుంది.
దీని డేట్స్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనేది చూద్దాం, మీకు డేట్ వచ్చిన సమయం నుంచి 14 రోజుల తర్వాత ఇలా ఓవులేషన్ జరుగుతుంది. కరెక్టుగా 28 రోజులకి డేట్ వచ్చేవారికి ఇలా సైకిల్ ఉంటుంది. ఉదాహరణకి అమ్మాయికి డేట్ మార్చి1న వచ్చింది అంటే మార్చి 14న ఓవిలేషన్ పిరియడ్.
ఈ టైమ్ లో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఎక్కువ. డాక్టర్ల సూచన ప్రకారం ఓవులేషన్ కి ఐదు రోజుల ముందు కలిస్తే గర్భధారణకి చాలా ఎక్కువ అవకాశాలుంటాయి. ఇక ఈ సమయంలో పురుషుడి స్పెర్మ్ స్త్రీ శరీరంలోకి వెళితే ఆమె ఎగ్ రిలీజ్ అయ్యేవరకూ అక్కడ కొద్ది రోజులు శుక్రకణాలు ఉంటాయి.. ఇలా 2 కలిసిన సమయంలో ప్రెగ్మెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే 11వ తేది నుంచి 20 వ తేది వరకూ కలిస్తే ఆ పదిరోజుల కలయికతో ప్రెగ్నెన్సీ రావచ్చు.