మనం ఫ్రిజ్ లో అనేక రకాల కూరగాయలు స్టోర్ చేసుకుంటాం. అయితే కొన్ని ఆహారాలు అసలు ఫ్రిజ్ లో స్టోర్ చేయవద్దు అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఆ ఫుడ్ పోవడంతో పాటు మిగిలిన ఆహారం కూడా చెడిపోతుంది. మనం తినే కూరగాయల్లో బంగాళాదుంపలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కూరలు ఫ్రై, కూర్మా ఇలా అనేక రకాలుగా చేసుకుంటాం.
ఇక ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దీనికోసం అనేక పద్దతులు అవలంభిస్తారు. ముఖ్యంగా బంగాళా దుంపలు స్టోర్ చేసే విషయంలో ఇవి తెలుసుకోండి.
1. తడిగా ఉన్న ప్రదేశాల్లో ఆలూను ఉంచకూడదు.
2. గాలి తగిలేలా డ్రై ప్లేస్లోనే ఉంచాలి.
3. ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు.
4. చమ్మతగలకుండా చూసుకోవాలి.
5. వాటిని ఫ్రిజ్లో పెట్టవద్దు దుంపలు ఫ్రిజ్లో పెట్టగానే దుంపల్లోని పిండిపదార్థం షుగర్గా మారిపోతుంది.
ఇలాంటివి తింటే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది.
6 దుంపలు నిల్వ ఉండాలంటే వాటిని నీటిలో కడగవద్దు
7. అధిక ఎండలో కూడా ఉంచవద్దు
8. పాతకొత్త దుంపలు అస్సలు కలవనీయకండి
9. వేరే కూరగాయలతో ఇవి కలపకండి
10. దుంపలు కోసిన 1 గంటలోనే వాడుకోవడం మంచిది.