రసగుల్లాలు అంటే చాలా మందికి ఇష్టం.. ఇది వరకూ ఇంటిలో ఇవి చేసుకునేవారు, ఇప్పుడు చాలా కంపెనీలు రసగుల్లాలు తయారు చేసి బాక్సుల్లో అమ్ముతున్నాయి, ఇక స్వీట్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు, ఇంత వరకూబాగానే ఉంది, అయితే ఈ రసగుల్లా ఎంత టేస్ట్ ఉంటుందో అంత జాగ్రత్తలు చూసి కొనకపోతే అసలుకే ప్రమాదం.
ఇటీవల కొన్ని బాక్సులు ఓపెన్ చేస్తే అవి డేట్ అయిపోయి నిలవ అయి స్మెల్ కూడా వచ్చేశాయి, ఇలాంటివి తినడం వల్ల ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయింది గుజరాత్ లో, అందుకే అన్నీ స్టోర్స్ లోకూడా ఈ స్వీట్స్ డేట్ ఎక్స్ పైరీ చూసి కోనుక్కోవాలి అని చెబుతున్నారు.
అయితే ఇలాంటి డేట్ అయిపోయిన ఫుడ్ మాత్రం ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా ఫుడ్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇవ్వండి, కాలం చెల్లిన స్వీట్స్ తినడంతో 12 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.. దీంతో వారిని కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే దగ్గరలోని ఆస్పత్రికి కూడా తరలించారు, సో ఈ స్వీట్స్ విషయంలో జాగ్రత్త.