ఫ్లాష్ న్యూస్ — కంటి నుంచి 20 పురుగులు బయటకు తీశారు – తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోండి

-

చాలా వింత ఘటనలు వింత కేసులు చాలా వరకూ చైనాలోనే వినిపిస్తూ ఉంటాయి, ఇది కూడా అలాంటిదే ఏకంగా ఓ మనిషి కంటి నుంచి 20బతికున్న పురుగులను వైద్యులు వెలికితీశారు. 60 ఏండ్ల రోగి వాన్గా తన కంటి నుంచి మంట నీరు కారుతోంది అని వైద్యుల దగ్గరకు వెళ్లాడు, అయితే అతనికి కంటి చూపు బాగానే ఉంది కాని మంట విపరీతంగా వస్తోంది.

- Advertisement -

తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని సుజౌ నగరానికి చెందిన వాన్.. కంటి మంట నానాటికి పెరుగడంతో సుజౌ మునిసిపల్ ఆస్పత్రికి వెళ్లాడు డాక్టర్ పరీక్ష చేశాడు, అతని కుడి కనురెప్ప కింద చిక్కుకున్న చిన్న పురుగుల సమూహాన్ని గుర్తించారు.

రోగి కనురెప్ప నుంచి రెగ్లీ పురుగులను బయటకు తీసి ఓ కంటైనర్లో ఉంచాడు. 20 తెల్ల సన్నని రౌండ్వార్మ్లను బయటకు తీశారు. ఇవి బతికే ఉన్నాయి, అయితే ఇవి ఎలా వెళతాయి అంటే మనం పెంచుకునే జంతువుల వల్ల ఇవి మన శరీరంలోకి వెళతాయి.

కుక్కలు, పిల్లులు, ఇతర జంతువుల కండ్లకలక, కన్నీటి నాళాలలో నివసించే పరాన్నజీవులు. లార్వా పురుగులుగా అభివృద్ధి చెందుతాయి.. అయితే అతని ఇంట్లో ఏమీ పెంచుకోవడం లేదు.. మరి ఇవి ఎలా వచ్చాయి అనేది అర్దం కావడం లేదు అతనికి. అతను గడ్డి దగ్గర వ్యాయామం చేస్తాడు. అక్కడ సోకి ఉంటాయి అని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...