వేసవిలో చెమట నుండి ఉపశమనం పొందాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

0
110

మారుతున్న జీవనవిధానంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. కావున మనం తీసుకునే ఆహారంతో పాటు..పరిసర ప్రాంతాల్ని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. వేసవిలో  చెమట పట్టడం వల్ల కేవలం దుర్వాసనే కాకుండా..ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కావున వేసవిలో చెమట పట్టకుండా ఈ ఇంటి చిట్కాలు పాటించండి.

వేసవిలో చెమట, దుర్వాసన సమస్యతో బాధపడేవారికి  ఐస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చెమట అధికంగా పట్టే ప్రాంతాల్లో  ఐస్ ముక్కతో రుద్దడం వల్ల దుర్వాసన తొలగిపోవడంతో పాటు..శరీరం కూడా చల్లబడుతుంది. అంతేకాకుండా చెమట వాసన తొలగించడంలో దోసకాయ కూడా సహాయపడుతుంది. వేసవిలో స్నానం చేసే ముందు చెమట పట్టే ప్రదేశాలలో చల్లని దోసకాయను రుద్దండి.

దీంతో చెమటలు పట్టే సమస్య పోయి ఎల్లప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు. నిమ్మకాయ కూడా శరీర దుర్వాసనను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ స్నానం చేసే ముందు నీళ్లలో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి తలస్నానం చేయాలి. చెమట, దుర్వాసన సమస్య దూరమవుతుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చెమట నుండి ఉపశమనం పొందండి.