మన శరీరంలో అతి ప్రధానమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి, గుండె వ్యాధి వచ్చినా లేదా నొప్పి వచ్చినా ప్రాణాపాయం ఎక్కువ, మరి అలాంటి గుండెని ఎంత పదిలంగా చూడాలి, మన రక్తం కూడా అక్కడ నుంచి సరఫరా అవుతుంది, అందుకే గుండె విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
గుండె బాగుండాలి అంటే ముందు మద్యం సిగరెట్లు మానెయ్యాలి, మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉండేవారు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది.
మీకు ఆయాసం సమస్య ఉంటే అతిగా నడవద్దు, ఫ్యాట్ ఉండే ఫుడ్ తీసుకోవద్దు, చికెన్ చేపలు ఒకే మటన్ వద్దు బీఫ్ వద్దు అంటున్నారు నిపుణులు, అయితే ఎక్కువ టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు.. అతిగా మద్యం సిగరెట్టు కాల్చేవారు వాటిని మానెయ్యాలి, అలాగే గుండె జబ్బులకి ప్రధాన కారణం బరువు సో అది పెరగకుండా చూసుకోవాలి.