మూత్రంలో మంట తగ్గాలంటే ఒక్కసారి ఈ టిప్స్ పాటించి చూడండి..

0
94

ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి మూత్ర సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఎండల కారణంగా చాలామంది డీహైడ్రాట్ సమస్యకు గురవుతుంటారు. దీనివల్ల మూత్రం మండటం, మూత్రం రంగు మారడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి చాలా మంది ఎన్నో చిట్కాలు ప్రయత్నించిన ఆశించిన మేరకు ఫలితాలు మాత్రం లభించవు. అందుకే ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాలు ప్రయత్నించి చూడండి..

ఈ సమస్య ఉన్నవారు పొద్దున్న లేవగానే వీలయినన్ని ఎక్కువ నీళ్లు తాగడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో రోజుకు కనీసం 6-7 లీటర్ ల నీళ్ళు తాగడం వల్ల మూత్రవిసర్జ చేస్తున్నప్పుడు మండడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.

ఎండాకాలంలో నిమ్మరసం, సబ్జాగింజలు, కొబ్బరినీళ్లు, మజ్జిక, పుదీనా వంటి ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. అంతేకాకుండా పండ్లరసాలు తీసుకోవడం వల్ల కూడా మూత్రం మండటం, మూత్రం రంగు మారడం వంటి సమస్యల నుండి త్వరగా బయటపడొచ్చు.