డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

-

ఈ రోజుల్లో చాలా మందికి డయాబెటీస్ సమస్య ఉంది… వీరు ముఖ్యంగా తీపి పదార్దాలు ఏమీ తీసుకోరు, అంతేకాదు బెల్లం చక్కెర పదార్దాలు తీసుకుంటే షుగర్ పెరుగుతుంది అని వాటికి దూరంగా ఉంటారు, అలాగే రైస్ తినడం కూడా బాగా తగ్గించేస్తారు.

- Advertisement -

షుగర్ రాకుండా ఉండాలి అంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.ఇప్పుడు యువతకు కూడా చాలా మందికి డయాబెటిస్ వస్తోంది సో అందుకే ఆహారం జీవన శైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం, స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు అతిగా తినడం వంటివి దీనికి కారణం.

షుగర్ సమస్య ఉన్న వారు లేదా షుగర్ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అని చూసేవారు ముఖ్యంగా పాలిష్ పట్టని బియ్యం తీసుకోండి ..దీని వల్ల షుగర్ లెవల్ పెరగదు, ఇక ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి ఓ పూట కచ్చితంగా రైస్ తీసుకుని మరో పూట ఆహారంలో రాగులు, గోధుమలు, సజ్జలు, జొన్నలు వంటి చిరు ధాన్యాలు వంటలు తీసుకోండి.

షుగర్ ఉంటే ఉపవాసాలు చేయవద్దు, కొంచెం తిన్నా ఫుడ్ మాత్రం తప్పక తీసుకోండి, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లను తీసుకోండి దీని వల్ల షుగర్ రాదు, ఉన్నా డైట్ వల్ల అదుపులో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...