Food Combinations | గుడ్డుతో వీటిని కలిపి తింటే అంతే సంగతులు..!

-

Food Combinations | మన ఆరోగ్యానికి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఏ వైద్యుడి దగ్గరకు వెళ్లినా డైట్‌లో గుడ్డు ఉంచుకోవాలని చెప్తుంటారు. కంటి చూపుకు, ఎముకల బలానికి ఇలా ఎన్నో ప్రయోజనాలను గుడ్డుతో పొందొచ్చు. చాలా మందికి గుడ్డంటే అమితమైన ఇష్టం కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం అల్పాహారంగా కూడా గుడ్డునే ప్రిఫర్ చేస్తారు. ఫిట్‌నెస్ ప్రియులు కూడా గుడ్డును ఎక్కువగా తింటారు. ఇందులో ఉండే పోషకాలే ఇందుకు ప్రధాన కారణం. కొందరు దీనిని పచ్చిగా తింటే మరికొందరు ఉడకబెట్టుకుని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకొందరు ఫ్రై చేసుకుని తినడానికి, ఇంకా చాలా మంది ఆమ్లెట్ రూపంలో తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఉడికించిన గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. బ్యాచిలర్స్, కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు గుడ్డుతో రకరకాల రెసిపీలను ట్రై చేస్తుంటారు. కొత్తకొత్త రెసిపీలను తయారు కూడా చేస్తుంటారు.

- Advertisement -

గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, సెలెనియం, ఐరన్ అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లు మన ఎముకుల బలానికి కూడా ఎంతో దోహదపడతాయి. గుడ్డును సరైన క్రమంలో వినియోగిస్తే జుట్టు, చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా గుడ్డుతో బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ గుడ్డును సరైన క్రమంలో తింటే ఎన్ని లాభాలు ఉంటాయో.. నిర్లక్ష్యంగా దేనితో పడితే దానితో కలుపుకుని తింటే మాత్రం సమస్యలు తప్పవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని కొన్ని ఎగ్ కాంబినేషన్స్ అయితే ప్రాణాలకే ప్రమాదం తెచ్చే అవకాశం ఉందని, కాబట్టి గుడ్డు ఎలా తినాలి అన్న దాంతో పాటుగా వేటితో కలుపుకుని తినకూడదు అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఆ కాంబినేషన్స్(Food Combinations) ఏంటో ఒకసారి చూద్దామా..

చక్కెర: పంచదార, గుడ్డు కలుపుకుని తినకూడదు. పంచదారలో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డులో కూడా ఇవి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు కలిసి తీసుకోవడం వల్ల శరీరంలో అమైనో ఆమ్లాల స్థాయిలు అధికమవుతాయి. అధికమైన అమైనో ఆమ్లాలు విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఈ రెండిటి కాంబినేషన్ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. శరీరంలో అమైనో యాసిడ్స్ మోతాదు పెరిగితే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది.

టీ, కాఫీ: వీటితో కూడా గుడ్డును కలుపుకుని తీనకూడదు. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడతారు. కానీ ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గందరగోళం మొదలవుతుందని, అజీర్తి, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని నుంచి తప్పించుకోవడం కోసం ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. వీటితో పాటుగా డైరీ సంబంధిత ఆహార పదార్థాలను కూడా గుడ్డుతో కలిపి తీసుకోకూడదని వైద్యులు చెప్తున్నారు.

అరటి: గుడ్డు, అరటి పండు చాలా డెడ్లీ కాంబినేషన్ అని వైద్యులు చెప్తున్నారు. వీటిని విడివిడిగా తింటే ఎన్ని లాభాలు ఉంటాయో కలుపుకుని తింటే అన్నే సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. గుడ్డు, అరటి పండు రెండిటిలో కూడా ఫైబర్ స్థాయిలు అధికంగా ఉంటాయి. దాని వల్ల ఈ రెండూ కలుపుకుని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఈ కాంబినేషన్ ఎంత వీలయితే అంత దూరంగా ఉండాలని అంటున్నారు నిపుణులు.

పొట్లకాయ: గుడ్డు, పొట్లకాయ కాంబినేషన్ వల్ల కూడా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ప్రొటీన్లు జీర్ణం కావడానికి సమయం ఎక్కువ పడుతుంది. గుడ్డు, పొట్లకాయ రెండిటిలో కూడా ప్రొటీన్ శాతం అధికంగా ఉండటం వల్ల ఈ రెండూ కలిపుకుని తింటే జీర్ణమవడం కష్టమవుతుంది. ఈ రెండు కలిపి తింటే మలబద్ధకం కూడా వచ్చే సమస్య ఉందని చెప్తున్నారు వైద్యులు.

పుల్లటి పండ్లు: నిమ్మజాతి పండ్లు లేదా ఏదైనా పుల్లటి పదార్థాలతో కలిపి కూడా గుడ్డును తినకూడదని వైద్యులు చెప్తున్నారు. ఈ కాంబో కూడా పొట్ట ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు. ఈ కాంబినేషన్ వల్ల అధిక తేన్పులు, వికారం, వాంతులు అయ్యే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అంతేకాకుండా గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

చికెన్, మటన్: చాలా మంది మాంసాహార ప్రియులు చికెన్, మటన్‌తో గుడ్డును కలుపుకుని తినడానికి తెగ ఇష్టపడతారు. కానీ ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇక్కడ కూడా ప్రొటీన్ సమస్యే ఉంటుందని వివరిస్తున్నారు. మాంసంలో, గుడ్డులో ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. అంతేకాకుండా అలసట, నీరసం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్‌కు కూడా దూరంగా ఉండటం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే చాలా వరకు గుడ్డు కాంబినేషన్‌లు జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది, కడుపు ఆరోగ్యం కోసం గుడ్డుతో ఈ కాంబినేషన్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read Also: రాగులే కదా అని తీసిపారేయకండి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...