వర్షాకాలం వచ్చేసింది. ఇక వానలు కురిశాయి అంటే సీజనల్ వ్యాధులు కూడా పలకరిస్తాయి. అందుకే వానాకాలం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా వర్షంలో ఎక్కువ తడిసేవారు జలుబు, జ్వరం ఇలాంటి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వానలో తడిచిన వెంటనే ఆ బట్టలు అస్సలు ఉంచుకోవద్దు. దీని వల్ల జ్వరం , జలుబు అనారోగ్య సమస్యలు వస్తాయి.
అయితే ఈ వానాకాలం సమయంలో కచ్చితంగా కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కచ్చితంగా పసుపు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి
దాల్చిన చెక్క
నల్ల మిరియాలు
లవంగాలు
నిమ్మకాయ
ఈ ఫుడ్ కచ్చితంగా ఈ వానాకాలం తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది.