కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో చూస్తునే ఉన్నాం. అయితే ఓసారి కరోనా వస్తే రెండోసారి రావడం చాలా అరుదు అని కొందరు భావిస్తారు. కానీ రెండోసారి కరోనా వచ్చిన వారు ఉన్నారు. అందుకే అశ్రద్ద వద్దు అని నిపుణులు తెలియచేస్తున్నారు. కాని ఓ వ్యక్తి 10 నెలలుగా కరోనాతో పోరాటాం చేస్తున్నాడు.
ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన డేవ్ స్మిత్ ఓ రిటైర్డ్ ఉద్యోగి. స్మిత్ వయసు 72 ఏళ్లు. స్మిత్ గత ఏడాది కరోనా బారినపడ్డాడు. ఏకంగా 10 నెలల పాటు కరోనా అతడ్ని విడవలేదు. ఇప్పటి వరకూ చికిత్స అందించి 43 సార్లు పరీక్షలు చేశారు వైద్యులు. ప్రతీసారి ఆయనకు పాజిటీవ్ అని వచ్చింది. ఇక కొన్ని నెలలు ఇంట్లో మరికొన్ని నెలలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ సమయంలో వైద్యులు కూడా ఈ కేసుపై చాలా ఆలోచన చేశారు.
ఈ కేసును వైద్యులు ఓ సవాల్ గా స్వీకరించారు. స్మిత్ శరీర స్థితిపై ఓ అంచనాకు వచ్చిన వైద్యులు ఆఖరిగా రెజినరాన్ యాంటీబాడీ థెరపీ అమలు చేశారు. దారుణమైన స్దితిలో ఉన్న అతను ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నాడు. ఇక అతను మన మాటలకు స్పందిస్తున్నాడు. ఇక తాజాగా టెస్ట్ చేస్తే ఆయనకు కరోనా నెగిటీవ్ అని వచ్చింది. ఇక స్మిత్ చాలా ఆనందంలో ఉన్నాడు, వైద్యులకి ధన్యవాదాలు తెలిపాడు.