Good News: నేటి నుంచి ఉచిత బూస్టర్​ డోస్..కేవలం వారికే!​

0
113

కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఈ మహమ్మారి పని పట్టడానికి మన దగ్గర ఉన్న ఓకే ఒక అస్త్రం వ్యాక్సిన్. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే రెండు డోసులను కోట్ల మంది ప్రజలకు అందించారు. ఇక ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనుంది. ప్రభుత్వ దవాఖానాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వ‌ర‌కు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం.. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు అసుప‌త్రుల‌కు అనుమ‌తించింది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది ల‌బ్ధి పొంద‌లేక‌పోయారు. దీనితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గమనిక:

రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోసు వేస్తారు.