పండ్లు కూరగాయలు ఇలా శుభ్రం చేయండి ఏ వైరస్ అయినా పోతుంది ?

పండ్లు కూరగాయలు ఇలా శుభ్రం చేయండి ఏ వైరస్ అయినా పోతుంది ?

0
110

ఈ కరోనా కాలంలో ఏది ముట్టుకున్నా చేతులు శానిటైజ్ చేసుకుంటున్నాం, అయితే మరి పాలు కూరగాయలు పండ్లు తెచ్చుకుంటున్నాం కదా , మరి వాటి సంగతి ఏమిటి? అవి ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే చాలా మంది నాలుగు ఐదు సార్లు ఆ కూరగాయలు కడిగి అప్పుడు ఫ్రిజ్ లో పెడుతున్నారు. లేదా బాస్కెట్ లో వేస్తున్నారు.

అయితే దీనికి కూడా వైద్యులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.. ఇలా చేస్తే వైరస్ కచ్చితంగా కూరగాయలకు పండ్లకు ఉన్నా నశిస్తుంది అంటున్నారు…ఉప్పు, పసుపుతో కూరగాయలను 20 నిమిషాలు కడిగితే వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా తొలిగిపోతుంది.

కరోనా వైరస్సే కాదు ఏ వైరస్ ఉన్నా నశిస్తుంది అంటున్నారు, ముందు ఉప్పు బేసిన్లో వేసి అందులో నీరు పోయండి, ఇలా ప్రతీ కూరగాయ ఇందులో కడగాలి, ఇక చివరగా ఓ స్పూన్ పసుపు కూడా బేసిన్లో వేసి చివరగా కడగండి.. వీటిని పొడి క్లాత్ తో తుడిచి కూరగాయలు పండ్లు జాగ్రత్త చేసుకోండి. ఏ వైరస్ ఉండదు, ఇక చాలా మంది సబ్బులు శానిటైజర్లు పండ్లకి కూరగాయలకు రాస్తున్నారు ఇలా చేయద్దు. దీని వల్ల కడుపులో సమస్యలు వస్తాయిప్రేగులకి ….కడుపులో శానిటైజర్ సబ్బులు వెళితే చాలా ప్రమాదం. కేవలం ఉప్పు పసుపుతో మాత్రమే పళ్లు కూరగాయలు ఆకుకూరలు శుభ్రం చేసుకోండి.