పండ్లు కొనేటప్పుడు ఈ స్టిక్కర్లు చూశారా దీని వెనుక రీజన్ ఇదే

పండ్లు కొనేటప్పుడు ఈ స్టిక్కర్లు చూశారా దీని వెనుక రీజన్ ఇదే

0
99

మనం మార్కెట్లోకి వెళ్లిన సమయంలో పండ్లు కొంటే ఆ నిగనిగలాడే పళ్లకి పైన స్టిక్కర్లు ఉంటాయి, అయితే ఆస్టిక్కర్లు చూసి ఏమైన ప్రముఖ ఫార్మ్ నుంచి వచ్చి ఉంటాయి. అందుకే వారి బ్రాండ్ అలా ఉంది అని అందరూ అనుకుంటారు.

ఇక ఇలా స్టిక్కర్ ఉన్న పండ్ల ధర కూడా భారీగానే ఉంటుంది, పైగా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి. అయితే ఇలా పండ్లపై స్టిక్కర్ ఉండటానికి ఓ కారణం ఉంది, అయితే పండ్లు
ఎలా పండించారో ఆ స్టిక్కర్లే మనకి చెబుతాయి.

యాపిల్, దానిమ్మ, బత్తాయి, కివీ, పియర్స్ వంటి పండ్లపై ఈ స్టిక్కర్లు ఉంటాయి, మీరు కొనే పండుపై
3 లేదా 4 అంకెతో మొదలైన నాలుగు అంకెల నెంబర్ ఉంటే ఆ పండును కొన్ని రసాయనాలు, సహజసిద్ధమైన ఎరువుల సాయంతో పండించారని ఆ స్టిక్కర్ అర్ధం.

అదే 9 అంకెతో మొదలైన నెంబర్ స్టిక్కర్ పై ఉంటే అది పూర్తిగా సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా పండించారని అర్థం. ఇలాంటి ఫ్రూట్స్ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు,అదే 8 అంకెతో మొదలైన నెంబర్ ఉంటే ఆ పండ్లు జన్యువుల మార్పిడితో పండించారని అర్థం, సో అది ఈ స్టిక్కర్ల వెనుక ఉన్న రీజన్, చాలా మందికి ఇది తెలియదు.