ప్రపంచంలో టీ(Tea) లవ్ కంట్రీ అంటే టక్కున చెప్పే దేశం భారత్. ఇండియాలో ఉన్నన్ని టీ వెరైటీలు కూడా ప్రపంచమంతా కలుపుకున్నా ఉండవని కూడా కొందరు అంటున్నారు. ప్రతి రోజూ మన దేశ జనభాలో మూడో వంతు మంది మూడు నుంచి నాలుగు కప్పుల టీ తాగుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. దీనిని బట్టే మన దేశంలో టీకి ఎంత మంది లవర్స్ ఉన్నారో ఊహించొచ్చు. ఎర్రటి ఎండాకాలంలో కూడా టీ లేకుండా రోజు ప్రారంభం కాదు.. ముగియదు కూడా. అలాంటి టీ లవర్స్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) వారు వార్నింగ్ ప్రకటించారు. టీ లవర్స్ ప్రమాదంలో ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..
టీ తయారు చేసే ఆకులను ప్రాసెస్ చేసే సమయంలో పురుగుల మందులు(Pesticides), కెమికల్ కలర్స్‌ను విరివిగా వాడుతున్నట్లు వారి గ్రహించారు. వీటి కారణంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. కాబట్టి బయట హోటళ్లలో టీ(Tea) తాగొద్దని, ఇంట్లో కూడా అధికంగా టీని తాగొద్దని హెచ్చరించింది.