Garlic Benefits | వెల్లుల్లితో వెలకట్టలేనన్ని లాభాలు..

-

Garlic Benefits | మనం ఏం చేసినా.. ఎంత చేసినా.. ఆరోగ్యం కోసమే. ఆరోగ్యమే సరిగా లేకుంటే ఏం ప్రయోజనం. కానీ కొన్నికొన్ని సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్లు. కొన్ని పెద్ద వ్యాధులకు కూడా సరైన క్రమంలో తీసుకుంటే మన వంటింటి చిట్కాలు సరిపోతాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వీటిలో వెల్లుల్లి(చిన్నుల్లిపాయలు) ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. అందులోనూ సీజనల్ వ్యాధులకు వెల్లుల్లితో చెక్ చెప్పొచ్చంటున్నారు నిపుణులు. కాకపోతే వెల్లుల్లిని పరగడుపున తీసుకుంటే కొందరికి కడుపులో మంట రావడం, బీపీ పెరిగే అవకాశం ఉన్నందున వీటిని ప్రయత్నించే వారు ఒకరోజు పరీక్షించుకోవడం మంచిదని చెప్తున్నారు. తప్పక తినాల్సిందే అనుకుంటే మాత్రం ఉదయం తీసుకునే అల్పాహారంలో వెల్లుల్లిని తీసుకోవడం మంచిదని అంటున్నారు. వర్షాకాలం వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిని తగ్గించడానికి వెల్లుల్లి సరిపోతుందట.

- Advertisement -

ఇమ్యూనిటీ బూస్టర్: వెల్లుల్లి పాయలు రోగనిరోధక శక్తి బూస్టర్‌గా కూడా పనిచేస్తుందని వైద్యులు చెప్తున్న మాట. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తోంది. తద్వారా దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వెంటనే తగ్గుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఆర్థరైటిస్‌కు అద్భుత ఔషదం: ఆఖరికి ఆర్థరైటిస్ నొప్పుల నుంచి వెల్లుల్లితో ఉపశమనం పొందొచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ ఏదోక రూపాన వెల్లుల్లి తినడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. నూనె, వెల్లుల్లిని కలిపి వేడి చేసి ఆ నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. అలా చేస్తే రోజుల వ్యవధిలోనే ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లిని కచ్ఛితంగా నమిలే తినాలని లేదని, ఒకరెబ్బ పొట్టు తీసేసి మందుబిల్లలు వేసుకున్నట్లుగా మింగేయొచ్చని చెప్తున్నారు వైద్యులు. మన గుండె ఆరోగ్యాన్ని పునరుద్దరించడంతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో కూడా వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Garlic Benefits | వెల్లుల్లిని సరైన క్రమంలో తీసుకోవడం వల్ల నరాల్లో కడ్డకట్టిన రక్తాన్ని కరిగించడంలో, కొవ్వును కరిగించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని కిడ్నీ సమస్యలకు కూడా వెల్లుల్లితో చెక్ చెప్పొచ్చని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Read Also: అప్పడాలతో ఇంత ఆరోగ్యమా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bomb Threats | విమానాలకు మళ్ళీ బెదిరింపులు..

విమానాలకు బెదిరింపు కాల్స్(Bomb Threats) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రమంత్రి...

Dharani Portal | NICకి ధరణి పోర్టల్ బాధ్యతలు..

ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్...