పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుండడం సహజం. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తుంటుంది. అయితే ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే.. ఇక ఏ పనీ చేయబుద్ది కాదు.
తలనొప్పికి తల పగిలిపోతుందేమోనని అనిపిస్తుంది. కానీ కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంత సేపు చల్లని నీడలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. నీటిని తగినంత తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.
చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.