ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు అందరూ, మరీ ముఖ్యంగా ఆషాడం నెలలో కొత్త పెళ్లి కూతురు తన తల్లి ఇంటికి వెళుతుంది, ఈ సమయంలో గోరింటాకు చేతికి కాళ్లకి పెట్టుకుంటారు, అయితే పెళ్లి కాని అమ్మాయిలు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే, వారికి మంచి మొగుడు వస్తాడు అని అంటారు పెద్దలు.
అయితే ఎంత ఎక్కువ సేపు చేతికి ఉంచుకుంటే అంత ఎర్రగా గోరింటాకు పండుతుంది అంటారు, అయితే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం మజ్జిగ, వక్క, నిమ్మరసం వంటి పదార్థాలు వేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఇది చాలా మంది ఫ్రిజ్ లో పెడతారు ఇలా పెట్టకూడదు.
ఎర్రటి పెంకు లాంటి కుండలో పెట్టండి రంగు పోకుండా ఉంటుంది, ఇక గోరింటాకు రాలిపోయే వరకూ అస్సలు కడగకండి, ఇక గోరింటాకు మొత్తం ఊడిపోయాక మీరు కడగకుండా నేరుగా కొబ్బరినూనె చేతులకి రాయండి, ఇక గతంలో గోరింటాకు చాలా మంది పిల్లలు పెట్టుకోకుండా తక్కువ సేపు ఉంచేవారట, అందుకే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని పెద్దలు చెప్పేవారు. వారు రాత్రి అంతా అలా ఉంచుకునేవారు అప్పుడు ఎర్రగా పండేది.