పూజల్లో కొబ్బరికాయది ప్రత్యేక స్థానం – దేవుడికి ఎందుకు కొబ్బరికాయ కొడతారో తెలుసా

0
74

మనం ఏ ఆలయానికి వెళ్లినా దేవుడికి కొబ్బరికాయ కొడతాం. ఏ పూజ జరిగినా ఏ హోమం జరిగినా ఏ వివాహం జరిగినా ఈ కొబ్బరికాయ ఉండాల్సిందే. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పండగలు, పూజలకు శుభకార్యాలకు ఇలా ప్రతి దానిలోనూ కొబ్బరికాయ కొడతాం. నైవేద్యంగా స్వామికి అమ్మవారికి సమర్పిస్తాం. కొబ్బరికాయను త్రిమూర్తులకు ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. అందుకే దానిని కాలితో తన్నరు పొరపాటున తలిగినా లెంపలేసుకుంటారు.

కొబ్బరికాయ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సూచిస్తుంది. అందుకే పూజల్లో ఈ కాయకి అంత ప్రాముఖ్యత ఉంది.
కొబ్బరిలోని మూడు చుక్కలు శివుని మూడు కళ్లకు ప్రతీక.
తెల్లని కొబ్బరి పార్వతిని సూచిస్తుంది
కొబ్బరి నీరు గంగను సూచిస్తుంది.
గోధుమ రంగు షెల్ కార్తికేయను సూచిస్తుంది .

అంతేకాదు కొబ్బరికాయని మనిషి తలతో సూచిస్తారు. అందులో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. ఇలా దేవుడికి కొట్టిన కొబ్బరి వల్ల మన మనస్సు స్వచ్ఛంగా ఎలాంటి కల్మషం లేకుండా ఉందని అర్దం.