గుడ్‌న్యూస్..దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా

Good news .. Corona declining in the country

0
108

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గత కొద్దికాలంగా మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనితో ప్రజలకు ఊరట కలిగింది.

సోమవారం 11,81,766 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..14,313 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజు 18 వేల మందికి వైరస్ సోకగా.. తాజాగా ఆ సంఖ్య 4,000 మేర తగ్గింది. నిన్న ఒక్కరోజే 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 3.39 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడగా.. అందులో 3.33 కోట్ల(98.04 శాతం) మందికి పైగా మహమ్మారిని జయించారు.

మరోపక్క క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2,14,900(0.63 శాతం)కి తగ్గింది. ఇక మరణాల సంఖ్య కూడా 200 దిగువనే ఉంది. నిన్న 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,50,963 మంది కరోనా కాటుకు బలయ్యారు.

కొద్ది రోజులుగా దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 65.86 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 95.8 కోట్లకు చేరింది.