రైల్వే ప్రయాణం చేసే వారు ఫుడ్ విషయంలో కాస్త ఆలోచన చేస్తారు.. మరీ ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే వారు ఫుడ్ దొరక్క ఇబ్బంది పడతారు… అయితే తాజాగా ఇండియన్ రైల్వే మీకు గుడ్ న్యూస్ చెబుతోంది, ఇక్యాటరింగ్ సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది.
ముందు కొన్ని ఫుడ్ డెలివరీ సేవలను కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో స్టార్ట్ చేస్తారు, జనవరి చివరి వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. రెస్టారెంట్ పార్ట్‌నర్స్ అందరికీ శుభ్రమైన కాంటాక్ట్‌లెస్ డెలివరీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
ఇక రైలు నెంబర్ పీఎన్ ఆర్ నెంబర్ బట్టీ మీకు ఫుడ్ డెలివరీ అవుతుంది..యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు, ఇక మీకు నచ్చిన ఫుడ్ ని తెప్పించుకోవచ్చు. త్వరలో దీనిపై డేట్ అనౌన్స్ చేస్తారు.