తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఔట్ సోర్సింగ్ లో 3035 ఉద్యోగాల భర్తీ

0
116

తెలంగాణలో ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. తెలంగాణ వస్తే కొలువులు బాగా వస్తాయని ఆశపడ్డారు విద్యార్థులు. కానీ వారు ఆశించిన రీతిలో ఉద్యోగాలు వస్తలేవని బాధపడుతున్నారు. అయితే తెలంగాణ సర్కారు ఔట్ సోర్సింగ్ ద్వారా 3035 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు మీకోసం…

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. అలాగే మరో 15 నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసింది. ఆయా కాలేజీల్లో సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. మెడకిల్ కాలేజీల్లో 2135 పోస్టులు, నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులను ఓట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రోనాల్డ్ రోస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ (ఫైనాన్సియల్ ఇయర్ ఎండింగ్) వరకు వీరి సేవలు ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, కొత్తగూడెం, జగిత్యాల, నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో కళాశాలకు 305 మంది చొప్పున సిబ్బందిని మొత్తం 2135 మందిని పొరుగు సేవల పద్ధతిలో నియమించనున్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన 13 నర్సింగ్ కాలేజీలతోపాటు ఇప్పటికే ఉన్న రెండింటితో కలిపి మొత్తం 15 కళాశాలల్లో ప్రతి కాలేజీకి 60 చొప్పున మొత్తం 900 మందిని నియమించుకునేందుకు అనుమతులు జారీ చేశారు. అనతికాలంలోనే ప్రక్రియ పూర్తి చేసి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొత్త ఉద్యోగాలు కల్పించబోతున్నారు.