గుడ్ న్యూస్..నయన్​-విఘ్నేశ్ పెళ్లి సందర్భంగా సీఎంకు ఆహ్వాన పత్రిక

0
48

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. వీరికి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి అడుగులు వేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మనందరం ఎదురు చుసిన విధంగానే వీరి పెళ్లి త్వరలో జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బంధువులకు, అతిథుల సమక్షంలో గతేడాది ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది.

ప్రస్తుతం వీరివురి పెళ్ళి మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో జూన్‌ 9న ఈ పెళ్లి జరగనున్నట్టు అధికారింగా ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి తప్పకుండా రావాలని తెలిపారు.