ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడం వల్ల అనుమానంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జినోమ్ సీక్వెన్స్‌కు నమూనాలు పంపించారు.
జినోమ్ నివేదికలో ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా రావడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవేళ ఒమిక్రాన్ అని తేలితే హైదరాబాద్‌లో కొన్ని ఆంక్షలు విధించాలని సర్కార్ యోచించినట్టు తెలుస్తుంది.