ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి మన దేశంలో చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆటలకు కూడా బయటకు పంపకుండా ఇంటిలోనే ఉంచుతున్నారు. అయితే తాజాగా ఓ వార్త కాస్త ఊరట ఇస్తోంది.చిన్న పిల్లలకు తట్టు (మీజిల్స్) రాకుండా వేయించే టీకాల వల్ల వారికి కొవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.
మీజిల్స్ టీకాలు వేయించుకున్న పిల్లలకు ఒకవేళ కరోనా సోకినా వారిపై అది పెద్ద గా ప్రభావం చూపదని తెలిసింది. కరోనా వైరస్ పై మీజిల్స్ టీకా 87.5 సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. అయితే దీనిపై ఇంకా లోతైన పరిశోధన చేస్తున్నారు.మీజిల్స్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలని చెబుతున్నారు.
మొత్తానికి ఈ వార్త విని చాలా మంది ఆనందిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా లోతైన పరిశోధనలు చేస్తున్నారు. 17 ఏళ్ల వయసున్న 548ని రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారట.