గుమ్మడికాయ వల్ల కలిగే పది ప్రయోజనాలు ఇవే

గుమ్మడికాయ వల్ల కలిగే పది ప్రయోజనాలు ఇవే

0
71

సాంబారు పేరు చెబితే కూర గుమ్మడి గుర్తు వస్తుంది, ఇక గుమ్మడి హల్వా కూడా చేస్తున్నారు ఈ మధ్య జనాలు, అయితే గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిది, పోషకాలు కూడా భారీగా ఉన్నాయి.
రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది, ఇక శ్వాస సంబంధ వ్యాదులు ఉన్నా తగ్గుతాయి, మరి ఇంకా ఎన్ని ఎన్ని పుష్కల ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

దీంట్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్-ఎ, బి1, బి12, సి, డి, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు ఉంటాయి. శరీరం చాలా యాక్టీవ్ గా ఉంటుంది, చర్మం మేనిరంగు వస్తుంది, వారానికి లేదా 15 రోజులకి తింటే గుండె సంబంధ వ్యాదులు ఉన్నా తగ్గుతాయి.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. షుగర్ సమస్య ఉన్న వారికి కాస్త బెటర్, మధుమేహం కంట్రోల్ లో ఉంచుతుంది, ఇక బరువు బాగా పెరుగుతున్నాం అని బాధపడేవారు వారానికి ఓసారి అయినా ఇది తీసుకోండి, ఎక్కడైనా కీటకాలు కుడితే అక్కడ గుమ్మడి రసం రాస్తే ప్రయోజనం ఉంటుంది, ఇక కాలిన గాయాలు మానాలి అనుకుంటే, కచ్చితంగా వారినికి ఓసారి ఇది టేస్ట్ చేయండి గాయాలు తొందరగా మానిపోతాయి.