కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రకరకాల క్యాన్సర్‌లో వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంటుంది. అసలు ఇంతమందికి క్యాన్సర్ రావడానికి కారణాలను వైద్యులు పూర్తిగా చెప్పలేకపోయినా.. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే క్యాన్సర్ బాధితులను ఒక స్టేజ్ వరకు మాత్రమే కాపాడగలం. ఒక స్టేజ్ దాటిన తర్వాత రోజులు లెక్కబెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇంతటి అత్యాధునికి వైద్య సమదుపాయాలు ఉన్నా క్యాన్సర్‌కు సరైన వైద్యం లేదు. అసలు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మార్గమని వైద్యులు చెప్తున్నారు. అయితే క్యాన్సర్ కారణాలకు నివారించడంలో ఒక జ్యాస్ బాగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదే జామకాయ జ్యూస్(Guava Juice).
జామకాయ జ్యూస్(Guava Juice) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ జ్యూన్ అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దాంతో పాటుగా క్యాన్సర్ ఉన్న వారికి కూడా జామకాయ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. వారి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నియంత్రించడానికి జామకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ నుంచి కూడా త్వరగా కోలుకునేలా చేసే శక్తి జామకాయ జ్యూస్‌కు ఉందని తెలిపారు.