చాలా మందికి ఈ రోజుల్లో జుట్టు సమస్య వేధిస్తోంది, బట్టతల రావడం లేదా జుట్టు ఊడిపోవడం ఇలాంటి సమస్యలు వేధిస్తున్నాయి, అలాగే చుండ్రు విపరీతంగా ఉంటోంది, దీని వల్ల ఎన్నో సమస్యలు, ఓ పక్క 20 ఏళ్లకే ఈ సమస్యలు చాలా మందికి వేదిస్తున్నాయి. ఎన్ని మందులు మింగినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు అంటున్నారు నేటి యువత.
శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటారు అనేది తెలిసిందే, అయితే మీ కురుల కోసం మీరు ఉల్లిరసం వాడాలి, ఇది నిపుణులు చెబుతున్న మాట, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా దీనిని వాడవచ్చు.
ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. దీనిని ఎలా చేయాలి అంటే ముందు ఉల్లిపాయలు మూడు తీసుకోండి వాటిని ముక్కలు కోసి పేస్ట్ లా మిక్సీలో చేయండి, ఆ పేస్టుని ఓ మంచి కాటన్ క్లాత్ లో వేసి పిండితే రసం వస్తుంది…తల కుదుళ్లకు తగిలేలా ఇది రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలపై ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. ఈఉల్లిరసానికి మంచి కొబ్బరినూనె రాసి కుదుళ్లకి పట్టిస్తే జుట్టు ఎదుగుతుంది.