డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ముందు ఎవరైనా వెహికల్ అనేది నడపడం నేర్చుకోవాలి. లేదంటే చాలా కష్టం వారికి డ్రైవింగ్ లైసెన్స్ రాదు. 15 రోజులు నేర్చుకుంటే కార్ డ్రైవింగ్ వస్తుంది. ఇంకొందరు 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకుంటారు. మరికొందరికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఈమె 17 ఏళ్ళ వయస్సు నుంచి డ్రైవింగ్ కోసం ప్రయత్నం చేసినా డ్రైవింగ్ రాలేదట. ఇంతకీ ఎందుకు ఆమెకి డ్రైవింగ్ రావడం లేదు అనేది చూద్దాం.
ఈమె పేరు ఇసబెల్లె స్టెడ్మన్. వయసు 47 సంవత్సరాలు. డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకోవాలని 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తోంది. ఏకంగా డ్రైవింగ్ కోసం 10 లక్షలు ఖర్చు చేసింది. ఈమె ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. నేను గత 30 సంవత్సరాలుగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. కానీ డ్రైవింగ్ రావడం లేదు. దీనికి కారణం నాకు కారు ఎక్కగానే విపరీతమైన భయం వస్తోంది.
వెంటనే కళ్లు తిరుగుతాయి. దీంతో నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను అని చెబుతోంది. అయితే ఆమెకి బ్లాక్ అవుట్ సమస్య ఉంది. కారు నడిపిన వెంటనే ఆమె ఒక్కసారిగా టెన్షన్ కు గురవుతుంది. ఇక తనకు వచ్చిన సమస్య వల్ల డ్రైవింగ్ నేర్చుకోలేదు లైసెన్స్ పొందలేదు. కానీ ఆమె పిల్లలు డ్రైవింగ్ లైసెన్సులు సాధించారని సంతోషంగా చెబుతుంది. కచ్చితంగా ఏదో ఓరోజు డ్రైవింగ్ లైసెన్స్ పొందుతా అని చెబుతోంది.