గర్భిణులకు హైబీపీ..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

0
115

గర్భిణుల్లో రక్తపోటును సూచించే పై అంకె (సిస్టాలిక్‌ ప్రెషర్‌) 140, అంతకన్నా ఎక్కువుంటే అధిక రక్తపోటుగా భావిస్తారు. సమస్య తీవ్రమైతే గర్భిణిలో గుండెజబ్బులకు దారి తీయొచ్చు. మరి గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి రక్తపోటు తగ్గించే మందులు ఇవ్వొచ్చా..? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల మరణాలకు రెండో అతిపెద్ద కారణమిదే. సమస్య తీవ్రమైతే గర్భిణిలో గుండెజబ్బులకు దారితీయొచ్చు. కాన్పు అయిన వెంటనే లేదా కొన్నేళ్ల తర్వాత కూడా గుండెజబ్బు తలెత్తొచ్చు. నెలలు నిండక ముందే కాన్పు కావొచ్చు. పిల్లలు తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికే చికిత్స ఉపయోగపడుతుంది. కానీ దశాబ్దాలుగా వీరికి మందుల వాడకంపై మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏహెచ్‌ఏ శాస్త్రీయ సూచన ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మూలంగా సుమారు 5శాతం నుంచి 7శాతం మంది గర్భిణులు గర్భవాతం (ప్రిఎక్లాంప్సియా) బారినపడుతున్నారు. దీంతో 70వేల మంది గర్భిణులు, 5 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని అంచనా.