ఈ కేసు చాలా విచిత్రమైన కేసు అతను తాగుబాతు నిత్యం తాగుడే అతని పని. అలవాటు ప్రకారం బార్ లో మందుతాగి ఆ మత్తులో వేరే ఒకరితో గొడవకు దిగాడు. చివరకు అతనే తిరిగి కేసు వేసి, తాను మందుతాగిన బార్ నుంచి నష్టపరిహరం రాబట్టాడు. టెక్సాస్ కు చెందిన డానియల్ రాల్స్ 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్ గా తాగాడు.
ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. రాల్స్ తలకు గాయమైంది. చివరకు ఆస్పత్రిలో కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తర్వాత బార్ పైనే కేసు వేశాడు. ఈ బార్ అండ్ రెస్టారెంట్ వల్లే తాను ఎక్కువగా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఈ గొడవ అక్కడ పార్కింగ్ ఏరియాలో జరిగింది . దీనికి వారే బాధ్యులు అని కేసు వేశాడు.
అక్కడ అంత గొడవ జరుగుతున్నా, బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదని వారి అందరిపై కేసు పెట్టాడు. దీనిపై బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించాడు. అతను ఇలా చాలా సార్లు గొడవపడ్డాడు జైలుకి వెళ్లాడు అని తెలిపాడు. కానీ కోర్టు అవి పట్టించుకోలేదు. చివరకు తాగుబోతుకి సపోర్ట్ గా తీర్పు ఇచ్చింది. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి అతనికి చెల్లించాలని బార్ ని ఆదేశించింది.