కరివేపాకుతో కమ్మని ఆరోగ్యం మీ సొంతం..

-

కరివేపాకుతో(Curry Leaves) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకులు ఎలా తీసుకున్నా మనకు మేలే చేస్తుంది. టీ కాసుకుని తాగినా సరే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కరివేపాకు. కానీ కరివేపాకు వల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే పక్కాగా చెప్పడానికి చాలా మంది కష్టపడతారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయామెటిక్, హిపటో ప్రొటెక్టివ్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు మరెన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటాయి కూడా. కరివేపాకు మన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా కీలకంగా పనిచేస్తాయి. కరివేపాకును వంటలో వాడటం వల్ల వంటకం రుచితో పాటు మన ఆరోగ్యం కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

కరివేపాకులో విటమిన్ సీ, ఏ, బీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి మరెన్నో మంచి పోషకాలు కరివేపాకులో పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకులో ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ వీటిని ప్రతిరోజూ మితంగానే తీసుకోవడం చాలా ముఖ్యం. లేనిపక్షంలో మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి కరివేపాకుతో ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం..

మధుమేహం: ప్రతిరోజూ ఉదయం పూట 10 కరివేపాకు ఆకులను మెత్తగా నమిలి గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహ సమస్యను సులభంగా నియంత్రించొచ్చు. దాంతో పాటుగా కరివేపాకు మన పేగు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. విరేచనాలు, వాంతులను నియంత్రించడంలో కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తాయి.

నోటి ఆరోగ్యం: నోటి దుర్వాసన సమస్య నుంచి కూడా కరివేపాకుతో ఉపశమనం లభిస్తుంది. రెండు నుంచి నాలుగు ఆకులను నమిలి తినడం ద్వారా, కరివేపాకు కషాయాలతో నోటిని పుక్కిలించడం ద్వారా మన నోటి వాసన మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఉదయం టీ స్పూనుడు కరివేపాకు రసం తాగడం ద్వారా అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ చెప్పొచ్చని నిపుణులు చెప్తున్నారు.

రక్తపోటుకు దివ్య ఔషధం: కరివేపాకులు(Curry Leaves) రోజూ ఉదయాన్నే తీసుకోవడం ద్వారా మధుమేహంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకులు ఎలా తీసుకున్నా రక్తపోటును నియంత్రించడం సులభతరం అవుతుందనేది నిపుణులు చెప్తున్నమాట.

Read Also: అవిసె గింజలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Thirsty | అతిదాహం.. ఈ రోగాలకు సంకేతమా..!

ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో వ్యాధులను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక...

Bengaluru | ఆటో వాలా ఆలోచన అదుర్స్.. ఇంప్రెస్ అవుతున్న నెటిజన్స్..

Bengaluru | మార్కెటింగ్ అనేది ఒక ఆర్ట్. మన దగ్గర ఉన్న...