Salt Water Benefits | ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డాక్టర్ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తుంటే మరికొందరు చిట్కాలు పాటిస్తుంటారు. అయితే ఇలాంటి చిట్కాలతో అనేక ఆరోగ్య సమస్యలు అసలు రాకుండా ముందుగానే నివారించొచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. ఆయుర్వదంలో చూస్తే మనం వంటింట్లో వాడే ప్రతి వస్తువు మన ఆరోగ్యానికి దోహదపడుతుంటాయి. వీటిలో ఉప్పు కూడా వస్తుందని చెప్తున్నారు నిపుణులు. రోజూ ఉదయాన్నే గ్లాసుడు ఉప్పునీళ్లు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయిన చెప్తున్నారు నిపుణులు. చాలా మంది ఉప్పునీళ్ళు అనగానే కాస్తంత అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఉప్పునీళ్ళు తాగితే ఏం మేలు జరుగుతుందని ప్రశ్నిస్తుంటారు. కాకపోతే ఉప్పునీటిని ఎలాపడితే అలా తాగితే ఇబ్బందులే తలెత్తుతాయని, కానీ ఒక క్రమ పద్దతిలో ఉప్పునీటిని తీసుకుంటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయని నిపుణులు చెప్తున్న మాట. మరి ఆ ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకుందామా ..
అతి చమటకు చెక్: రోజూ ఉదయాన్ని పరగడుపున గ్లాసుడు మంచినీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఉప్పునీరు తాగితే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. వేడి వాతావరణంలో ఉండే వారికి, అతి చెమట సమస్యతో ఇబ్బంది పడుతుండే వారికి ఇదొక వరమని అంటున్నారు. వారి సమస్యకు ఉప్పు నీరు దివ్య ఔషధంలా పనిచేస్తుందని చెప్తున్నారు. ఉప్పులో ఉండే లవణాలు అతిగా చెమట రావడాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.
ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతకు ఊతం: ఉప్పునీరు మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతకు ఎంతో సహాయపడతాయి. ఉప్పులో ఉండే సోడియంతో పాటు పోటాషియం, క్లోరైడ్‌ల మధ్య సమతుల్యం రావడానికి ఉప్పునీరు సహాయపడుతుంది. శరీరానికి కావాల్సినంత నీరు కూడా అందుతుండటంతో నాడీకణాలు, కండరాలు కూడా సమతుల్యంతో పనిచేస్తాయి. వ్యాయామం, జిల్ చేయడం వల్ల ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం అదుపుతప్పిన సందర్భాల్లో వాటిని సరిచేయడంలో ఉప్పునీరు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమ్యలకు కూడా ఉప్పునీటితో చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
జీర్ణం ప్రక్రియకు సూపర్: ఉప్పు నీటితో జీర్ణ ప్రక్రియ కూడా మెరుగు పడుతుందని వైద్యులు అంటున్నారు. కడుపులో జీర్ణరసాలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని పెంచడంలో ఉప్పునీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడంలో కూడా ఉప్పునీరు దోహదపడుతుంది. ఉప్పునీరు తాగడం వల్ల పేగుల్లోకి అదనపు నీరు చేరడం వల్ల మలబద్దక సమస్య కూడా తగ్గిపోతుందని, క్రమం తప్పకుండా ఉప్పునీరు ఉదయాన్నే తాగడం వల్ల మలబద్దక సమస్యకు స్వస్తి పలకొచ్చని చెప్తున్నారు పోషకాహార నిపుణులు.
చర్మ ఆరోగ్యానికి భేష్: వీటన్నింటితో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఉప్పునీరు అద్భుంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఉప్పునీటిలో చర్మానికి మేలు చేసే అనేక లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో ఉప్పునీరు బాగా పనిచేస్తుందని, నీరు సరిపడా అందడంతో చర్మంలో తేమ స్థాయిలు తగ్గవని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా ఉప్పునీరు తగ్గిస్తుంది. దరుదలు, దద్దుర్లు వంటి సమస్యలను కూడా ఉప్పునీరు తగ్గిస్తుందని చెప్తున్నారు.
Salt Water Benefits | శ్వాసకోస వ్యవస్థకు కూడా ఉప్పనీరు మేలు చేస్తుందని వైద్యులు చెప్తున్న మాట. ప్రతి రోజూ ఉప్పునీటిని పుక్కిలించడం వల్ల గొంతు గరగర, జలుబు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని, దీంతో పాటుగా పలు శ్వాసకోస సంబంధిత ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఉప్పునీరు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే ఈ ఉప్పునీరు చేసుకోవడం కోసం రాక్‌సాల్ట్ వినియోగం మంచిదని చెప్తున్నారు.