Eating Curd | పెరుగు తింటే ఇన్ని లాభాలా..?

-

Eating Curd | పెరుగన్నం తినకుండా లేస్తే.. భోజనం ముగియదని పెద్దలు చెప్తుంటారు. కానీ చాలా మంది మాత్రం పెరుగు వేసుకుని భోజనాన్ని ముగించడానికి ఇష్టపడరు. అసలు పెరుగు వేసుకోకుండా నచ్చినట్లు ఆహారం తినేసి భోజనాన్ని ముగించేస్తారు. ఇంట్లో ఉండే పెద్దోళ్లు ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా మంది పెరుగన్నం లేకుండానే భోజనాన్ని ముగించడం అలవాటుగా మార్చుకుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదని, మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. భారతీయ ఆహారంలో పెరుగు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని, కానీ ప్రస్తుతం బిజీ లైఫ్‌లో పెరుగు లాభాలను ప్రజలు మర్చిపోతున్నారని వైద్యులు అంటున్నారు.

- Advertisement -

చాలా మంది ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఫాస్ట్‌ఫుడ్‌లు లాగించేస్తుంటే, మరికొందరు పెరుగన్నం తినడమే మర్చిపోతున్నారు. కానీ ప్రతి రోజూ పెరుగన్నం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెరుగు ప్రయోజనాలు తెలిస్తే ఎవరూ కూడా దీనిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటారని కూడా వైద్యులు భరోసా ఇస్తున్నారు. ప్రతి రోజూ మన ఆహారంలో పెరుగును భాగం చేసుకోవడం వల్ల మన జుట్టు నుంచి జీర్ణవ్యవస్థ వరకు ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు అంటున్నారు. ఆ ప్రయోజనాలేంటంటే..

జుట్టు బలానికి: పెరుగులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ పెరుగును తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి వత్తైన, కాంతివంతమన జుట్టు మనకు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.

రోగనిరోధక శక్తి: పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేస్తాయి. వీటితో యాంటీబాడీల ఉత్పత్తి క్రియాశీలకమవుతుంది. ఫలితంగా అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుంది. దీంతో పాటుగా తరచూ పెరుగు తినడం(Eating Curd) వల్ల శరీరంలోని ఇతర రక్షణ వ్యవస్థలు కూడా బలోపేతమవుతాయి.

షుగర్‌కు చెక్: పెరుగును రోజూ తినడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించొచ్చని వైద్యులు అంటున్నారు. పెరుగులో ఉండే ప్రొటీన్లు, కొవ్వుల కారణంగా ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ మెల్లగా విడుదలవుతుంది. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి. కావున డయాబెటిక్ పేషంట్లకు పెరుగు ఎంతో మేలు చేస్తుందని, వారు పెరుగును తరచుగా తినడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

బలమైన ఎముకలు: పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. మినరల్స్ కూడా పెరుగులో అధికంగానే ఉంటాయి. ప్రతి రోజూ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం ద్వారా.. పెరుగులోని మినరల్స్.. ఎముకలను బలంగా మారుస్తాయి. ఎముకల్లో ఏర్పడే బోలును తగ్గిస్తాయి. ఎముకలే కాకుండా మన దంతాలు కూడా దృఢంగా మారుతాయని వైద్యులు చెప్తున్నారు.

జీర్ణవ్యవస్థకు మేలు: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఆహారంలోని పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహించడంలో కూడా పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా పెరుగు తినడం ద్వారా ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపుబ్బరం, మలబద్దకం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది.

గుండెకు మేలు: పెరుగుతో పాటు పుల్లబెట్టబడిన డైరీ పదార్థాలతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. పెరుగుతో బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని పరిశోధకులు చెప్తున్న మాట.

బరువు నియంత్రణ: పెరుగు తరచుగా తినడం వల్ల మన బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. జర్నల్ ఆఫ్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, పెరుగుతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. పెరుగులో ఉన్న అధిక ప్రొటీన్ల కారణంగా కడుపు చాలా సేపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫలితంగా, ఆహారం తక్కువగా తీసుకుంటారు. అంతేకాకుండా పెరుగుతో జీవక్రియలు కూడా వేగవంతమవుతాయి. ఈ రెండిటి ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది.

Read Also: చలికాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..? ఇలా చేసి చూడండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....