Health Benefits | ఉల్లిపాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

-

Health Benefits | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక నానుడి ఉంది. అందులో వాస్తవం ఎంత అనేది చాలా మందికి ఉన్న అనుమానమే. కానీ వైద్యులు మాత్రం ఈ నానుడి అక్షర సత్యమని అంటున్నారు. శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడటంలో ఉల్లి అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే అనేక పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రతి రోజూ ఒక్క పచ్చి ఉల్లిపాయనైనా తినడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

- Advertisement -

పాతకాలంలో ఆహారంలో పచ్చి ఉల్లిపాయ నంచుకోవడం చాలా సాధారణమని, అప్పటి ప్రజల ఆరోగ్యానికి అది కూడా ఒక ప్రధాన కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీర్ణ సమస్యల నుంచి గుండె సమస్యల వరకు మరెన్నో ఇబ్బందులను తగ్గించడంలో ఉల్లి సహాయపడుతుందని వివరిస్తున్నారు.

జీర్ణవ్యవస్థకు: ఉల్లిపాయల్లో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ ఉల్లిపాయను తినడం ద్వారా జీర్ణ సమస్యలు తలెత్తవు. ఉన్నవి కూడా తగ్గిపోతాయి. ఉల్లిపాయల్లో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులపై పోరాడటంలో సహాయపడతాయి. తద్వారా ఉదర సంబంధిత సమస్యలు రాకుండా కూడా ఉల్లిపాయ కాపాడుతుంది.

కొవ్వును తగ్గించడం: ఉల్లిపాయను తినడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. ఉల్లిలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్ మన శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చెడు కొవ్వు శాతం తగ్గడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

రోగనిరోధక శక్తి: ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వ్యక్తులకు ఉల్లిపాయలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో విటమిన్-సీ, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. దాంతో పాటుగానే మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.

అధిక బరువు: బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దాని వల్ల పచ్చి ఉల్లిని ఆహారంతో కలిపి తీసుకుంటే కడుపు నిండిన భావన త్వరగా కలగడంతో పాటు వీటిలో అధికంగా ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. దీని వల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేమని, దాంతో బరువు తగ్గుతామని వైద్యులు చెప్తున్నారు.

చర్మానికి: ఉల్లిపాయలను రోజూ తినడం ద్వారా చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉల్లిలో సల్ఫర్ సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మొటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని మృధువుగా, కాంతివంతంగా ఉంచడంలో ఉల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

గుండె ఆరోగ్యం: ఉల్లిపాయలు మన గుండెను భద్రంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉల్లిపాయల్లో ప్లేవనాయిడ్లు, థయోసల్పినేట్ల సమ్మెళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. దీంతో పాటుగా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా కూడా ఉల్లిపాయలు చూసుకుంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.

Health Benefits | అయితే మేలు చేస్తాయి కదా అని ఉల్లిపాయలను ఎక్కువగా తింటే తిప్పలు తప్పవని కూడా చెప్తున్నారు వైద్యులు. ఉల్లిపాయలను అధికంగా తినడం ద్వారా జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు మరెన్నో ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలను ప్రతిరోజూ కూడా కొంత మోతాదులోనే తీసుకోవడం మేలు చేస్తుందని చెప్తున్నారు.

Read Also:  పెరుగు తింటే ఇన్ని లాభాలా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....