అవిసె గింజలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

-

డైటింగ్ చేద్దామని స్టార్ట్ చేసిన వారిలో చాలా మంది తమ ఆహారంలో అవిసె గింజలు(Flax Seeds) యాడ్ చేసుకుంటారు. అవేనండి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా.. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా అవిసె గింజలను తీసుకుంటారు. కానీ వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటి అంటే ఎవరూ సరైన సమాధానం కాదు కదా.. మచ్చుకకు రెండు మూడు కూడా చెప్పలేరు. దానర్థం వీటి వల్ల ఆరోగ్య లాభాలు లేవని కాదు. చాలా తక్కువ మందికి తెలుసని. అవిసె గింజలు మన శరీరిక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మన గుండె, ఊపిరితిత్తులను పదిలంగా ఉంచడంలో అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మన నరాలు, ఎముకల బలానికి కూడా ఇవి కీలకంగా పనిచేస్తాయి. మరి అవిసె గింజల వల్ల మరెన్ని లాభాలున్నాయో ఒకసారి చూసేద్దాం.

- Advertisement -

అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా 3, 6, థయామిన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ వంటిని అధికంగా ఉంటాయి. వీటిలోని ఒమెగా యాసిడ్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. గుండె సరైన క్రమంలో కొట్టుకునేలా కూడా చేస్తాయి.

ఫ్లాక్ సీడ్స్‌లో విటమిన్లు, విటమిన్ ఈ, బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఎముకలు, చర్మ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. పోటాషియం మన నరాల బలానికి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఐరన్.. రక్త కణాలను సమృద్ధిగా ఉంచుతాయి. శరీరం అంతటా రక్త సరఫరా సక్రమంగా జరిగేలా కూడా అవిసె గింజలు చేస్తాయి.

వీటిలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా నియంత్రిస్తాయి. ఇందులోని లిగ్నాన్స్ శరీరంలోని హర్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు రొమ్ము, ప్రొస్టేట్, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయి.

ఫ్లాక్ సీడ్స్(Flax Seeds) మన రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో కూడా అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం మనకు ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడా ఉంచుతాయి. తద్వారా అతిగా తినడకుండా మన నోరుకట్టేసుకోవడం సాధ్యమవుతోంది. దీని వల్ల శరీరంలోని క్యాలరీల ఇన్‌టేక్ గణనీయంగా తగ్గుతుంది. అది బరువు తగ్గడం(Weight Loss) కోసం ఉపయోగపడుతుంది.

అవిసె గింజల్లో 95శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి. వాటిలో ఒకటి జీర్ణక్రియ మెరుగుపరిస్తే మరొకటి చెడు కొవ్వును తగ్గించడంలో క కీలకంగా పనిచేస్తాయి. దాని కారణంగా వేగంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటితో పాటుగా వీటిలో ఉండే ఒమెగా యాసిడ్స్, విటమిన్ ఇ రెండూ కూడా మన జుట్టుకు కూడా మేలు చేస్తాయి.

Read Also: లెమన్ వాటర్‌తో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...