Rice Starch | వర్షానికి వేడిగా సూప్ తాగాలనుందా.. హెల్తీ అండ్ టేస్టీ ‘గంజి’ ట్రై చేయండి..!

-

మన పూర్వీకులు ప్రతిరోజూ అన్నం వండి గంజి(Rice Starch) కాచేవారు. ఆ గంజిని తాగే వారు. అందుకే వారు అంత దృఢంగా, అనారోగ్యం ఉండేవారని చెబుతుంటారు. కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు. అసలు గంజి అంటే ఈ జనరేషన్ లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే… మళ్లీ పాత రోజుల్లో వండినట్టు గంజి వార్చి అన్నం వండడం మొదలుపెడతారు. రెస్టారెంట్లలో ఎక్కువ డబ్బులు పోసి తాగే సూప్ కంటే గంజి రుచి కూడా చాలా బాగుంటుంది మరి.

- Advertisement -

గంజిని అన్నంలో వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుంది. చర్మాన్ని సున్నితంగా, అందంగా మార్చుతుంది. చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని వదిలిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు గంజిని తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. గంజితో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పసి పిల్లలకు, ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగిస్తే చాలా మంచిది.

వారికి సరైన పోషకాలు అందుతాయి. శారీరక ఎదుగుదల కూడా బావుంటుంది. పిల్లలు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నప్పుడు గంజిని మించిన దివ్యౌషధం లేదు. కనుక ఇంట్లో కుక్కర్ అన్నం వండడానికి బదులు గంజి వార్చేలా అన్నం వండితే చాలా మంచిది. గంజి(Rice Starch)ని ఇంటిల్లిపాది తాగితే ఆరోగ్యం మీ సొంతం.

Read Also: బరువు తగ్గాలి అనుకునేవారికి సగ్గుబియ్యం ఓ వరం!!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...