నోని పండు లాభాలు తెలిస్తే అస్సలు నో చెప్పరు!

-

ఫలాలు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలుసు. వీటిలో ఫలానా పండు మంచిది.. ఫలానా పండు చెడు చేస్తుందని అనడానికి లేదు. ఏది ఎప్పుడు తీసుకుంటున్నాము అన్న దానిపై ఆధారపడే వాటి ప్రభావం ఉంటుంది. వీటి నుంచి ‘నోని’ పండు(Noni Fruit) ఏమీ మినహాయింపు కాదు. కానీ ఈ పండు గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అసలు ఈ పేరుతో ఒక పండు ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఇక దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే. దానినే ‘తొగరు పండు’ అని కూడా అంటారు. దీనిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయని ఆరోగ్య నిపుణులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటిని ప్రస్తుతం విరివిగానే పండిస్తున్నారు. ఈ పండు చూడటానికి బంగాళ దుంప ఆకారంలో పసుపు, లేత ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది. ఈ పండులో లోపల చిన్నచిన్న విత్తనాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి నోని పండు చేసే ప్రయోజనాలు చెప్తే నో అనకుండా లాగించేస్తారని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

నోనీ పండులో విటమిన్లు, మినరల్స్, పోషకాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సీ, బయోటిన్, ఫోలేట్, విటమిన్ ఈ, మొక్కల ఆధారిత ఫ్లేయనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్స్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో చిన్న చిన్న రోగాల నుంచి పెద్దపెద్ద వ్యాధులు రాకుండా కూడా నిలువరిస్తుంది. మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా నోని పండు అద్భుతంగా పనిచేస్తుంది. ఎలర్జీలు, చిన్నచిన్న రుగ్మతలు ఇలా మరెన్నో రోగాలు రాకుండా ఈ పండు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థకు, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. వాటన్నింటి నుంచి మనల్ని కాపాడటంలో నోని పండు ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు. వాటిలో కొన్ని ఏంటో తెలుసుకుందాం.

కాణాలకు కంచు కోట: శరీరంలోని ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బ తిన్న కణాలను రిపెయిర్ చేయడంలో నోని పండు దివ్యఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా కణాలను కాపాడటంతో పాటు వాటికి కంచుకోట లాంటి రక్షణను అందించడంలో కూడా నోని పండు అద్భుతంగా పనిచేస్తుంది. నోని జ్యూస్ తాగడం వల్ల కూడా శరీరంలో శక్తి లేమి అన్న భావన లేకుండా ఉంటుంది. రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా పనిచేయగలుగుతాం. దాంతో పాటుగా కండరాలు అరిగిపోకుండా కూడా కాపాడుతుంది ఈ పండు.

న్యూట్రియెంట్ల స్టోర్ హౌస్: నోని పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనినే ఫైటో న్యూట్రియెంట్ల స్టోర్ హౌస్‌గా కూడా పిలుస్తారు నిపుణులు. అంతేకాకుండా ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంతో పాటు మన జీవక్రియను సమతుల్యం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

హైపర్ టెన్షన్‌కు చెక్: నోని పండ్లు తినడం ద్వారా హైపర్ టెన్షన్‌కు చెక్ చెప్పొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచడానికి బాగా పనిచేస్తుంది. లక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, రక్త నాళాలు, రక్త ప్రసరణను సక్రమంగా ఉండేలా చూడటంలో కూడా పోటాషియం సహాయపడుతుంది.

దీంతో పాటుగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా నోని పండు(Noni Fruit) బాగా పనిచేస్తుంది. రోజుకు ఒకటి నుంచి రెండు గ్లాసుల నోని పండు జ్యూస్ తాగితే ఈ నొప్పుల నుంచి బయటపడొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.

Read Also: కుక్కర్‌లో కుక్‌డ్ ఫుడ్ తింటే ఇన్ని తిప్పలా..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...