మన ఆరోగ్యం మన ఆహారంలోనే ఉంటుందని వైద్య నిపుణులు చెప్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆహారంపై దృష్టి పెట్టాలని అంటారు. ఇలా మనం వండుకునే ఆహారంలో ఆలివ్ ఆయిల్(Olive Oil) వాడకం మన ఆరోగ్యానికి ఎంతో ఊతమిస్తుందని కూడా ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మరి అధికశాతం మంది ఆరోగ్య నిపుణులు చెప్తున్న ఈ ఆలివ్ ఆయిల్‌లో అసలు ఏముంది. ఆలివ్ ఆయిల్‌ను రోజూ మన ఆహారంలో తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. మరి ఇంకెందుకు ఆలస్యం రండి తెలుసుకుందాం..
ఆలివ్ ఆయిల్(Olive Oil) రోజూ తీసుకోవడం వల్ల మన రక్తంలో షుగర్ లెవెల్స్‌ని నియంత్రించడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
- ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో ఇది సహాయపడుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అంటే మధుమేహం రోగులకు ఆలివ్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది.
- మీరు ప్రతిరోజూ ఆలివ్ నూనెలో ఆహారాన్ని వండినట్లయితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇలాంటి అనేక సమ్మేళనాలు ఆలివ్ నూనెలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి.
- ఆలివ్ నూనె జీర్ణ వాహిక, కడుపుకు చాలా మంచిదని భావిస్తారు. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, ప్రతిరోజూ ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఆలివ్ నూనెలో విటమిన్-ఇ, విటమిన్ కె, ఒమేగా-3, 6 కొవ్వు ఆమ్లాలు, ఐరన్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది.
- మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఆలివ్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
- ఆలివ్ నూనెతో కళ్ల దగ్గర మసాజ్ చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల అలసట తొలగిపోయి నిద్ర కూడా బాగుంటుంది.
- ఆలివ్ నూనెలో వండిన ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి.
- ఆలివ్ ఆయిల్ తినడం వల్ల అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది