బొప్పాయి ఆకులతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

-

బొప్పాయి కాయల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ వీటి ఆకులను మాత్రం ఏ పిచ్చి ఆకుల్లా తీసిపారేస్తుంటారు. కానీ వీటి వల్ల కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. బొప్పాయి పండు తింటే జీర్ణ వ్యవస్థ బాగుపడటం, రక్తంలో మలినాలు పోవడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి బొప్పాయి చెట్టు ఆకులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా. ఆయుర్వేద నిపుణులు మాత్రం బొప్పాయి ఆకులను(Papaya Leaves) దివ్యఔషధంగా చెప్తున్నారు. ఇందులో ఉండే అనేక పోషకాలు మన ఆరోగ్యానికి దోహదపడతాయి. ఈ ఆకును ఎలా తీసుకున్నా మన ఆరోగ్యానికి మేలే చేస్తుందని, ఈ ఆకులు, రసం ఏదైనా ఎంతో అద్భుతమైన ఔషధంగా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. వారంలో మూడు సార్లు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని అంటున్నారు. మరి ఇంతకీ ఈ బొప్పాయి ఆకుల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా..

- Advertisement -

వాపును తగ్గిస్తుంది..

బొప్పాయి ఆకుల్లో ఉండే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి లేదా ఇతర తాపజనక సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్..

బొప్పాయి ఆకులలో విటమిన్-సి, విటమిన్-ఇ, అనేక ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. కణాల నష్టాన్ని నివారిస్తాయి. దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..

బొప్పాయి ఆకులలో ఉండే ఎసిటోజెనిన్లు కాలేయాన్ని మురికి నుంచి కాపాడతాయి. దాని పని సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

బొప్పాయి ఆకు రసం మలబద్ధకం, ఉబ్బరం లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది, మంటను తగ్గిస్తుంది. ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.

డెంగ్యూ చికిత్సలో సహాయం..

డెంగ్యూ జ్వరంతో పోరాడడంలో బొప్పాయి ఆకు(Papaya Leaves) నీరు చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. ఇది ప్లేట్లెట్ కౌంట్ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది డెంగ్యూ బారిన పడిన వ్యక్తులలో వేగంగా పడిపోతుంది. బొప్పాయి ఆకు రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ మెరుగుపడుతుందని తేలింది. డెంగ్యూ చికిత్సలో ఇది సహజమైన.. సురక్షితమైన ఎంపిక.

Read Also: మూత్రం రంగు మన ఆరోగ్యం గురించి ఏం చెప్తుంది..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...