Sweet Potato | చిలగడ దుంపతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

-

చిలగడదుంప(Sweet Potato).. చిన్నప్పటి నుంచి దీనిని చిరుతిండిగానే తింటుంటాం. చలికాలం వచ్చిందంటే చిలగడదుంపల సీజన్ వచ్చినట్లే అర్థం. చలికాలంలో ఇవి విరివిగా అందుతాయి. వీటిని ఉడకబెట్టుకుని వేడివేడిగా తినడమే తప్ప దీని వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని చాలా భావిస్తుంటారు. కానీ వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

చిలగడదుంపలు పోషకాలకు భాండాగారాలని, వీటిని తింటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలో విటమిన్ ఏ, సీ, బీ6 పుష్కలంగా ఉంటాయని, దాంతో పాటుగా ఇందులో ఫైబర్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. చైనా వంటి దేశాల్లో వీటికి భారీ గిరాకీ ఉండటానికి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రధాన కారణం. వీటినే స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు.

ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవి తియ్యగా ఉండటంతో చిన్న పిల్లలు కూడా వీటిని ఇష్టం తింటారు. ఇవి చలికాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాదుల నుంచి మన శరీరాన్ని కాపాడటమే కాకుండా వాటితో పోరాడేలా మన రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. మరి వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఒక లుక్కేద్దామా..

జీర్ణవ్యవస్థ: చిలగడదుంపలలో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి. ఒకటి కరిగేవి అయితే మరో రకం కరగనివి. ఇవి మన జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో పోషకాలు మన పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

రోగనిరోధక శక్తి: చిలగడదుంపులను తినడం ద్వారా మన రోగనిరోధక వక్తి బలపడుతుంది. వీటలో ఉండే విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్లు తన రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అనేక సీజనల్ వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా కాపాడతాయి.

బరువు తగ్గడానికి: చిలగడదుంపల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. తద్వారా ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. దాంతో అనవసర ఆహారం తీసుకోము. దాంతో బరువు తగ్గడం వేగవంతం అవుతుంది. అదనంగా, ఇది కేలరీలు తక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక. బరువు తగ్గాలని అనుకునే వారు చిలగడదుంప తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.

గుండెకు మేలు: చిలగడ దుంపల్లో(Sweet Potato) పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గస్తుంది. ఫలితంగా ఉండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

మెరుగైన కంటి చూపు: మన కంటిచూపును మెరుగు పరచడంలో కూడా చిలగడదుంప బాగా పనిచేస్తుంది. వీటిలో ఉంటే బీటా కెరోటిన్.. శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. ఇంది మన కంటిచూపుకు చాలా కీలకం. కంటివుక్లం సహా పలు ఇతర కంటి సమస్యలను రాకుండా కూడా చిలగడదుంపులు సహాయపడతాయి.

వీటితో పాటుగా కాన్సర్‌తో పోరాడటానికి చిలగడదుంపలు సహాయపడతాయి. మన ఎముకలను బలపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటివి దీని స్పెషాలిటీస్. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా చిలగడదుంపలు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. జిమ్ చేసే వారికి ఇవి ఒక సూపర్ ఫుడ్‌గా కూడా పనిచేస్తాయి.

Read Also: వీరికి వంకాయ విషంతో సమానం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Aamir Khan | ‘మహాభారతం’ విషయంలో భయంగా ఉంది: ఆమిర్ ఖాన్

‘మహాభారతం’ చాలా మంది డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్. వారిలో టాలీవుడ్ ప్రముఖ...

Prakash Raj | మరోసారి రెస్పాన్సిబుల్ ఫాదర్‌గా ప్రకాష్ రాజ్..

పాత్ర ఏదైనా ఒదిగిపోయి నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చే నటుడు...