టామాటా జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..

-

భారతీయ వంటకాలలో టమాటాకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. చాలా వరకు వంటకాలలో టమాటాలను ఏదోక రూపాన వాడుతుంటారు. ఈ టమాటాలు ప్రతి రోజూ పచ్చివి తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు కూడా చెప్తారు. ముఖ్యంగా చాలా మంది టమాటా తినడం వల్ల రక్తం బాగా పడుతుందని, అంతకు మించి పెద్దగా లాభాలు ఏమీ ఉండవు అనుకుంటారు. మరికొందరు టమాటాలతో మహా ఉంటే చర్మ సౌందర్యంతో పాటు ఇంకా ఒకటి రెండు ప్రయోజనాలకు మించి ఉండవని అనుకుంటారు. కానీ వైద్యులు మాత్రం టమాటాలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయిన చెప్తున్నారు. టమాటాను ఎలా తీసుకున్నా ఈ ప్రయోజనాలను మనం పొందవచ్చని అంటున్నారు. కాగా ప్రతిరోజూ ఉదయాన్ని పరగడుపున ఒక గ్లాసుడు టమాటా జ్యూస్ తాగితే దాని ప్రభావం త్వరగా, ఇంకాస్త ఎక్కువగా ఉంటుందనేది నిపుణుల మాట. ఇంతకీ టమాటా జ్యూస్(Tomato Juice) తాగితే అంతగా వచ్చే లాభాలేంటో ఒకసారి చూసేద్దామా..

- Advertisement -

గుండె ఆరోగ్యం: టమాటా రసం రోజూ తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. టమాటాల్లో అధికంగా ఉండే పొటాషియం.. రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టమాటా రసం రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు స్థాయిలు మెరుగుపడతాయి. తద్వారా గెండు జబ్బులు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

జీర్ణవ్యవస్థకు బెస్ట్: టమాటా జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం ఇవ్వడంతో పాటు జీర్ణ వ్యవస్థను కూడా మెగుపరుస్తుంది. మన కడుపులోని ఆమ్లస్థాయిలను తగ్గించి ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది టమాటా జ్యూస్.

యాంటీ ఏజింగ్: టమాటా రసం ప్రతి రోజూ ఉదయాన్ని తాగడం వల్ల మన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మంలోని ఎలాస్టిసిటీని పెంచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దాంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. టమాటా జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడంం వల్ల మొటిమల సమస్యకు కూడా చెక్ చెప్పొచ్చు.

వెయిట్ లాస్: బరువు తగ్గాలని అనుకునేవారికి టమాటా జ్యూస్ అద్భుతమైన ఔషధం. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. అదే సమయంలో టమాటాలో ఎక్కువగా ఉంటే నీటి శాతం మన కొవ్వును పల్చబరచడంలో, శరీరంలోని టాక్సిన్స్‌ను క్లీన్ చేయడం కీలకంగా వ్యవహరిస్తాయి. దానికి తోడు టమాటా జ్యూస్ వల్ల జీర్ణక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటుంది. తద్వారా ప్రతి రోజూ టమాటా జ్యూస్ తాగడం బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

టమాటా జ్యూస్(Tomato Juice) ఎలా చేసుకోవాలంటే: నాలుగైదు టమాటాలు తీసుకుని వాటిని ముక్కులు చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే అందులో చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇందులో తీపి అంటే ఇష్టపడే వారు తేనేను కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జ్యూస్‌ను వడకట్టకుండా తాగడం వల్ల అందులోని విటమిన్స్ అన్నీ కూడా శరీరంలోకి వెళతాయని నిపుణులు చెప్తున్నారు.

Read Also: మనం తినే తీరు మన గురించి చెప్పేస్తుందా?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...