ప్రెజర్ కుక్కర్(Pressure Cooker)లు ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంటాయి. పొయ్యి ముందు నిల్చునే పని ఉండదనో, లేదంటే వంట ఈజీగా అయిపోతుందనో, మరేదైనా కారణమో చాలా మంది ప్రెజర్ కుక్కర్స్ వాడుతున్నారు. ఇది వరకు పట్టణాల్లో అధికంగా కనిపించే ఈ ప్రెజర్ కుక్కర్లు ఇప్పుడు పల్లెల్లో కూడా తిష్టవేశాయి. అయితే ప్రెజర్ కుక్కర్ల వినియోగంపై వైద్య నిపుణులు విస్తుబోయే విషయాలు చెప్తున్నారు. ప్రెజర్ కుక్కర్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ప్రతిరోజూ ప్రెజర్ కుక్కర్లో వండుకున్న అన్నం తింటే అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుందని, చిన్నవయసులోనే కాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాట. కుక్కర్లో వండే అన్నంలో పోషకాలు ఉండవని, పైగా ప్రమాదకరమైన రసాయనాలు విడుుదలవుతాయని నిపుణులు వివరిస్తున్నారు. రోజూ కుక్కర్‌లో వండిన అన్నం తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయంటే..
క్యాన్సర్: ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన అన్నం రోజూ తినే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్తున్నారు. నిజం చెప్తే ప్రెజర్ కుక్కర్ ప్రమాదాకారే అయినా ఎలక్ట్రిక్ కుక్కర్ మరింత ప్రమాదానికి దారి తీస్తుందని, కావున అన్నం త్వరగా వండాలి అనుకున్న సమయంలో ఎలక్ట్రిక్ కుక్కర్ కన్నా ప్రెజర్ కుక్కర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు వైద్యులు.
మట్టి మేలు: ఎలక్ట్రిక్, ప్రెజర్ కుక్కర్లో వండుకుని తినే కన్నా స్టీలు పాత్రలు నయమని, మట్టి పాత్రలయితే ఇంకా మంచిదని చెప్తున్నారు నిపుణులు. మట్టి పాత్రల్లో ఆహారం వండుకుని తింటే ఆరోగ్యకరమని అంటున్నారు. మట్టిపాత్రల్లో ఆహారం వండుకోవడం వల్ల పోషకాలు పోకుండా ఉండటం వల్ల ఆహారం మరింత రుచిగా ఉంటుందని వివరిస్తున్నారు.
ఎన్ని సమస్యలో: ఎలక్ట్రిక్, ప్రెజర్ కుక్కర్ల(Pressure Cooker)లో ఎక్కుగా అల్యూమినియం వాడుతుంటారు. ఇందులో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఉదర సంబంధిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్(ఎసిడిటీ), అధిక బరువు, నడుము నొప్పి వంటి మరెన్నో సమస్యలకు మన శరీరం నిలవవుతుంది. కావున కుక్కర్ వినియోగాన్ని సాధ్యమైనంత మానుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.