Health Tips: మనలో చాలామందికి తిని ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. ఏ టైంలో ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అనే అంశాలపై పెద్ద అవగాహన ఉండదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో పెద్దగా నియమాలు పాటించరు. కానీ కొన్ని ఆహారపదార్థాలు ఒక్కో సమయంలో తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కొన్ని రకాల ఫ్రూట్స్ తినడంవల్ల ఆరోగ్యపరంగా శరీరంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయట.
Health Tips: పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, దానిమ్మ పండ్లను పరగడుపున తినొచ్చు. జీర్ణశక్తితో పాట ఎనర్జీ లెవల్స్, ఆకలిని పెంచడంలో ఇవి బాగా తోడ్పడతాయి. బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, తగ్గుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ ఫ్రూట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో, బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో, హార్ట్ హెల్త్ మెరుగుపరచడంలో సహాయపడతాయి.