Health Tips Remedies for insomnia to help good sleep:మారిన జీవన పరిస్థితుల్లో గాఢ నిద్ర అనేది కరు వైపోతోంది. ఆహారపు అలవాట్లు, పనివేళలు, గాడ నిద్రను దూరం చేస్తున్నాయి. దీని వలన మానసి కంగా, శారీరకంగా అనేక సమస్యలు తలెత్తుతాయ న్నది అందరికీ తెలిసిన విషయమే అయినా, గాఢనిద్ర పట్టాలంటే ఏం చేయాలి? అన్నది చాలా మందికి తెలి యకపోవచ్చు. కొన్ని పద్ధతులను పాటించాలి. మరి కొన్ని పద్ధతులను వదిలేయాలి. అప్పుడే గాఢ నిద్ర పటడానికి అవకాశం ఉంటుంది. అవి ఏమిటంటే.. కబుర్లు, పనులు పెట్టుకోకండి. సెల్ ఫోన్ మీ గాఢ నిద్రను దూరం చేస్తుంది. సెల్ఫోన్ను పడుకునే ప్రదేశానికి దూరంగా పెట్టండి. వీలుంటే స్విచ్చాఫ్ చేయండి.
Health Tips పడుకునే ముందు టీ, కాఫీ లాంటివి తాగకండి. భోజనం పూర్తి చేసిన వెంటనే నిద్రపోకూడదు. నిద్రపోవడానికి కనీసం గంట ముందున్నా రాత్రి భోజ నాన్ని పూర్తి చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు మంచి సంగీతం, లేదా మంచి పుస్తకం చదవాలి. పడుకోబోయే ముందు పాలల్లో సోంపు వేసి మరిగించి ఆ పాలను తాగితే మంచిది. తలకీ, అరికాలికి నువ్వులనూనె మర్దనా చేసుకుంటే మంచి ఫలితం ఉంది.
పడుకోబోయే ముందు ఓ పావుగంట పాటు మెడిటేషన్ చేస్తే మంచిది. ఖర్జూరాలు, బాదం పప్పులను నీటిలో నాన పెట్టి, వాటికి కొద్దిగా గులాబీ రేకులు కలిపి ముద్దగా నూరు కొని దీన్ని నీటిలో వేసి మరిగించి వేడిగా తాగితే మంచిది.