Health tips: ఏం తిన్నా గొంతులో పట్టేసినట్లుంటుందా? కారం తింటే కడుపు మంట పుడుతుంటే మీకు ఎసిడిటీ ఉన్నట్లే. ఇలాంటప్పుడు తక్షణమే కొన్ని పనులు చేసి ఉపశమనం పొందొచ్చు.
పరగడుపున నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగాలి. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తాయి.
భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు.
అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్ ఉండి గుండె మంట నుంచి ఉపశమనం కల్పిస్తాయి. జీర్ణకోశం శుభ్రపర్చడానికి కూడా అరటిపండు ఉపయోగపడుతుంది.
పాలలో ఒక చెంచా తేనె చేర్చి తీసుకోవడం వల్ల ఛాతిలో, కడుపులో మంట తగ్గుతుంది.
రెండు లవంగాలను నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు(Health tips).