ఇప్పుడు దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కాస్త బలహీనపడుతోంది. రోజుకి నాలుగు లక్షలకు పైగా కేసులు వచ్చిన స్దితి నుంచి ఇప్పుడు లక్షలోపు కేసులకు చేరుకున్నాం. కొన్ని స్టేట్స్ లో వేలాది కేసుల నుంచి వందల కేసులకి వచ్చాయి. కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లు క్షేమంగా కోలుకుని ఇంటికి వెళుతున్నారు. ప్రాణవాయువు సమస్య తీరుతోంది.
అయితే కొన్ని స్టేట్స్ లో మాత్రం కేసులు తగ్గుతున్నా యాక్టీవ్ కేసుల సంఖ్య కాస్త ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఇప్పటికీ 4 రాష్ట్రాల్లోని కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని సగం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక్కడ కరోనా కేసులు కాస్త శాంతిస్తే కేసులు క్రమ క్రమంగా తగ్గే చాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు.
మరీ ముఖ్యంగా కరోనా అని అనుమానం ఉంటే అస్సలు బయటకు వెళ్లద్దు అంటున్నారు.
మహారాష్ట్ర 1,36,661
కర్ణాటక 1,51,566
కేరళ 1,09,799
తమిళనాడు 1.14,000 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఈ ప్రాంతాల్లో మరింత వేగవంతం చేయాలని నిపుణులు చెబుతున్నారు.