హైదరాబాదులో భారీ వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ

Heavy rain in Hyderabad..Orange alert issued

0
74

హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చైతన్యపురి ప్రాంతాల్లో వర్షం కురియడంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. దాంతో కొన్నిచోట్ల వాహనాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది.