అన్నం ఎక్కువగా తింటున్నారా దీని వల్ల కలిగే ప్రమాదం తెలుసుకోండి

అన్నం ఎక్కువగా తింటున్నారా దీని వల్ల కలిగే ప్రమాదం తెలుసుకోండి

0
100

మనసౌత్ లో ఎవరైనా భోజనం అంటే ముందు రైస్ మాత్రమే ఉండాలి రోటీ వద్దు అంటారు, అదే నార్త్ సైడ్ అయితే రైస్ కాదు మాకు రోటీ ఉండాలి అంటారు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ తింటారు, అయితే వైద్యులు మాత్రం చెప్పేది ఒకటే, ఏదైనా మితంగా తినాలి, అయితే రైస్ చాలా ఎక్కువగా తినేవారికి మూడు పూటలా రైస్ తీసుకుంటే కచ్చితంగా షుగర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది.

అధికంగా తెల్లబియ్యం వాడడం వల్లే దీర్ఘకాలికటైప్-2మధుమేహం వస్తోందని డయాబెటిస్ కేర్ అనే అమెరికన్ జర్నల్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది,రోజుకు 450 గ్రాముల కంటే అధికంగా తెల్లబియ్యంతో వండిన ఆహారాన్ని తినడం వల్ల మధుమేహం వస్తున్నట్లు తెలిపారు.

అందుకే ఈ మధ్య చాలా మంది అన్నం కంటే రోటీలు మిగిలిన టిఫిన్స్ ఎక్కువ తింటున్నారు. రాగి ముద్ద సజ్జలు జొన్నలు ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు రావు,
రాగులు, సజ్జలు, గోధుమతో తయారైన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహాన్ని ముందుగానే నివారించవచ్చునని సలహా ఇస్తున్నారు, ఇక కచ్చితంగా వారానికి మూడు రోజులు అయినా పప్పు తినాలి
చిక్కుడు కాయలు, ఆకుకూరలు అధికంగా చేర్చుకుంటే షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు.