అరటి తొక్కను తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..

0
108

అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. ఆహారం జీర్ణం కావడంలో అరటిపండు ప్రధానపాత్ర పోషిస్తుంది. కేవలం అరటి పండే కాదు దాని తొక్క తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అరటి తొక్కలోని పోషక ప్రయోజనాలు

అరటి తొక్కలో 12% ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. అరటి తొక్కలో విటమిన్ సి17% ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ బలపరుస్తుంది.ఇందులో విటమిన్ B-6 20% ఉంటుంది.

ఇది శరీర సామర్థాన్ని పెంచుతుంది. 12% పొటాషియం ఉంటుంది. అరటి తొక్కతో చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. పాదాల పగుళ్ల నివారణకూ అరటి తొక్క ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు తీసుకొని మిక్సీలో మెత్తగా చేసుకొని..ముఖానికి అప్లై చేసుకోవాలి.